Posts

వినరో భాగ్యం విష్ణుకథ

వినరో భాగ్యం విష్ణుకథ                                                 (మే9వ తేదీ అన్నమయ్య జయంతి సందర్భంగా....)'  'చందమామరావో ..జాబిల్లిరావో' అని ప్రతి తల్లి తన బిడ్డలకు అన్నం పెట్టేటప్పుడు మారాం చేస్తే పాడుతూ చందమామను చూపిస్తుంది. ఎందరో తల్లులు తమ బిడ్డలకు బువ్వ తినిపించేటప్పుడు పాడే పాట ఇది. ఈ పాట వ్రాసింది పదకవితాపితామహుడు, తొలివాగ్గేయకారుడు, సంకీర్తనాచార్యుడు తాళ్లపాక అన్నమాచార్యుడు. బిడ్డను నిద్రపుచ్చేటప్పుడు తల్లిపాడే లాలిపాట 'జో అచ్యుతానంద జోజో ముకుందా', ముద్దుగారే యశోద కొడుకు'వంటి పాటలు వ్రాసింది అన్నమయ్యే. ఇప్పటికి 500 ఏళ్లుగా గోవిందుని సన్నిధిలో కీర్తించే కీర్తనలు అన్నమయ్య నోటినుంచి జాలువారినవే. 'నారాయణా నమో నమో భవ నారద సన్నుత నమోనమో', కొండల్లో నెలకొన్న కోనేరు రాయుడు', తిరుమల కొండ', వినరో భాగ్యం విష్ణుకథ' వంటి ఆణిముత్యాలు అన్నమాచార్యుడు వ్రాసినవే.తెలుగుసంస్కృతిలోభాగమైన గొబ్బిళ్లు, తుమ్మెద, శృంగార, అధ్యాత్మిక కీర్తనలు అన్నమయ్య జాతికి ఇచ్చిన మణులు.జానపదుల నోట్లో అవి ఎల్లప్పుడూ నిలిచిఉంటాయి. ఆయన వేంకటేశునిపై అల్లిన శృంగార కీర్తనలు మనసుక